రాష్ట్రపతి ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన లాలూ ప్రసాద్

-

కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన మొదటి రోజే 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే సరైన ద్రువపత్రాలు లేకపోవడంతో.. ఒకరి నామినేషన్ తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగగా.. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుంది.

లాలూ ప్రసాద్ యాదవ్
లాలూ ప్రసాద్ యాదవ్

నామినేషన్ దాఖలు చేసిన వారిలో బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నట్లు పార్లమెంటరీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఢిల్లీ, బిహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని నిర్ణీత ఫార్మెట్‌లో నింపాలి. ఎలక్టోరల్ సభ్యుల్లో 50 మంది ప్రతిపాదించాల్సి ఉండగా.. మరో 50 మంది ఆ ప్రతిపాదనను ఆమోదం తెలపాలి. అలాగే రూ.15 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news