నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు పుట్టిన రోజు ఉత్సవాలను జరుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలి అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.”తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.
ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. వరి కొనుగోలు దగ్గరనుంచి విద్యుత్ చట్టాల వరకు ప్రతి దాంట్లోనూ రెండు ప్రభుత్వాల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. బహిరంగంగానే సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ సర్కార్ పై విమర్శలు సంధిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2022