శభాష్ ఈటల రాజేందర్‌.. భుజం తట్టిన ప్రధాని నరేంద్ర మోడీ

-

తెలంగాణ రాష్ట్ర పర్యటనను ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జి.వివేక్ వెంకటస్వామి, చాడా సురేష్ రెడ్డి, సీఎం రమేశ్ తదితరులు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మోదీ ఆయా నేతలందరితో అభివాదం చేస్తూ పలకరించారు.

పక్కనే ఉన్న ఈటల రాజేందర్ ను బండి సంజయ్ మోదీకి పరిచయం చేస్తూ ‘‘ హుజూరాబాద్ ఎన్నికల్లో జరిగిన హోరా హోరీ పోరులో టీఆర్ఎస్ ను ఓడించారు’’ అంటూ పరిచయం చేశారు. ఈటలను అభినందించిన నరేంద్రమోదీ అనంతరం బండి సంజయ్ భుజంపై చేయి వేస్తూ ‘‘ సంజయ్ బండి జీ… ఏం సంగతి? అంతా బాగే కదా… ఇక వెళ్లి రానా’’అంటూ ఆప్యాయంగా భుజం తట్టారు. అనంతరం అక్కడున్న మిగిలిన నేతలందరికీ అభివాదం చేస్తూ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news