ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ తేదీ ఖరారు

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో మోడీ నామినేషన్ తేదీని తాజాగా ఖరారు చేశారు.

2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన, ఈ నెల 14వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోడీ మే 13న తన పార్లమెంటరీ నియోజకవర్గాన్ని సందర్శించి, మే 14న భారీ రోడ్‌షో ద్వారా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, మే 5న అయోధ్యను సందర్శించనున్నారు మోడీ.రామాలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత నగరంలో భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు.2014 పార్లమెంట్ ఎన్నికలలో, నరేంద్ర మోడీ తొలిసారిగా వారణాసి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసి 3,71,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌పై 4,79,505 ఓట్ల తేడాతో గెలిచారు.జూన్ 1న లోక్‌సభ ఎన్నికల చివరి దశ(ఏడవది) వారణాసిలో పోలింగ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version