ఉదయాన్నే ఇలా చేసారంటే.. రోజులో అనుకున్న వాటన్నిటినీ పూర్తి చేసేయచ్చు…!

-

చాలామంది రోజులో పనులు పూర్తవక బాధపడుతూ ఉంటారు ఈ రోజు ఈ పని చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ కుదరదు. అయితే నిజానికి చాలామంది కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు దాంతో సమయం సరిపోవడం లేదు అనే భావన వాళ్ళల్లో కలుగుతుంది అలానే అనుకున్న పనుల్ని పూర్తి చేసుకోవడానికి కూడా అవ్వదు. అయితే మీ పనులు మీరు సరిగ్గా టైం కి పూర్తి చేయాలన్నా మీరు చక్కగా వినియోగించుకోవాలన్నా ఈ టిప్స్ ని కచ్చితంగా పాటించండి.

అప్పుడు రోజంతా కూడా మీరు అనుకున్న పనుల్ని పూర్తి చేసుకోవచ్చు. పైగా ఎక్కువ సమయం ఉన్నట్లు అనిపిస్తుంది. రోజంతా కూడా మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు.

ఏం చేయాలనుకుంటున్నారో చూసుకోండి:

బాగా ఎక్కువ పనులని ఒకే రోజు కాకుండా మీరు వాటిని కట్ చేయండి ఒక 15 పనుల వరకు ఈరోజు కోసం కేటాయించండి. వాటిని పూర్తి చేసేందుకు ఫోకస్ పెట్టండి.

బ్రేక్ తీసుకోండి:

మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉండండి లేకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. బ్రేక్ తీసుకోవడం వలన మీ యొక్క పని బాగా అవుతుంది. మధ్యలో స్నాక్స్ తీసుకోవడం భోజనం చేయడం మెడిటేషన్ చేయడం లేదంటే సరదాగా అటు ఇటు నడవడం వంటివి చేయండి ఇలా బ్రేక్ తీసుకుంటే కూడా మీ పనులన్నీ మీరు పూర్తి చేసుకోవడానికి అవుతుంది.

80/20ని పాటించండి:

మీరు రోజూ చేసి 20% లో 80 శాతం మాత్రమే ఫలితం వస్తుంది.

ఉదయం సమయాన్ని బాగా ఉపయోగించండి:

చాలామంది ఆలస్యంగా నిద్ర లేచి పనులను పూర్తి చేసుకోవాలి అనుకుంటారు. కానీ మీ రోజుని త్వరగా మొదలు పెడితేనే మంచిది. ఉదయాన్నే లేచి అల్పాహారం తీసుకుని ఆ తర్వాత మెల్లగా పనులను పూర్తి చేస్తూ ఉండండి.

బద్ధకాన్ని వదిలేయండి:

రోజు లో అనుకున్న పనులు పూర్తవ్వాలంటే బద్ధకం పనికిరాదు బద్ధకం గా ఉండకుండా మీ పనుల మీద ధ్యాస పెట్టండి. బద్ధకం ని వదిలేయండి అప్పుడు పనులు పూర్తి అవుతాయి. కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టి పనులుని పూర్తి చేసుకోండి.

మల్టీ టాస్కింగ్ వద్దు:

చాలామంది మల్టీ టాస్కింగ్ చేయాలని 10 పనులని ఒకేసారి చేద్దామనుకుంటారు అలా కాకుండా తక్కువ పనులను ఒకసారి పెట్టుకోండి అప్పుడు కచ్చితంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version