Breaking : గాంధీభవన్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం

-

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. అయితే… గాంధీభవన్ లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిష్టిబొమ్మను పార్టీ కార్యకర్తలు దగ్ధం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ కోమటిరెడ్డి ఆడియో కాల్ వైరల్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ నిరసన చేపట్టారు. మరో వైపు కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. మునుగోడు ఉప ఎన్నికలు, భారత్ జోడోయాత్ర ఏర్పాట్ల పై చర్చించనున్నారు. అలాగే కోమటిరెడ్డి ఆడియో టేపుల వైరల్ పై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

మునుగోడులో రాజగోపాల్ కు మద్దతివ్వాలన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కు చెందిన ఓ నాయకుడితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఫోన్ లో కాంగ్రెస్ నేతను కోరారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ తానే అవుతానంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ లో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పారు. పార్టీలను చూడొద్దని, రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలని కోరారు. ఏదైనా ఉంటే తానే చూసుకుంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తుంటారని, ఉప ఎన్నికలో ఓటు ఆయనకే వేయాలని ఫోన్ కాల్ లో రిక్వెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version