గుమ్మడిదలలో డంప్ యార్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నారు.ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా అక్కడ నిరవధిక నిరసనలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే గుమ్మడిదల డంప్‌యార్డ్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం మద్దతు తెలిపారు.నిరసన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
ఇదిలాఉండగా, డంప్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా గుమ్మడిదలలో ప్రజలు వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు.సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి, ప్యారా నగర్ గ్రామాల శివారులో డంప్ యార్డు ఏర్పాటు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ గేదెలతో, ఎడ్ల బండ్లతో రైతులు నిరసన తెలిపారు.అంతేకాకుండా, డంప్ యార్డుకు వ్యతిరేకంగా మోకాళ్లపై నిలబడి, గేదెలపై డంపింగ్ యార్డ్ వద్దు మా కడుపు కొట్టొద్దు అని రాసి రోడ్ల వెంట రైతులు ర్యాలీ తీశారు.