PS-1.. కళ్లన్నీ ఆమెపైనే.. ఎందుకంత స్పెషాలిటీ..!!

-

కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఆయన కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీన తెలుగు , తమిళ్, కన్నడ , మలయాళం, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచింది.. ఈ సినిమా ఫలితాన్ని చూసి మణిరత్నం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా రెండవ భాగం కూడా తెరకెక్కించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విక్రమ్ , జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష , ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఇక ఈ సినిమాలో ఇంతమంది స్టార్ సెలబ్రిటీల మధ్య ఒక టీనేజ్ అమ్మాయి అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. కనిపించింది కొన్ని సెకన్ల వ్యవధి అయిన అందర్నీ తనవైపు ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నందిని క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత ధూళిపాల ల అద్భుతమైన ప్రదర్శన గురించి అందరూ మెచ్చుకుంటూనే ఇలాంటి దిగ్గజ నటీమణుల మధ్య సారా అర్జున్.. 17 సంవత్సరాల ఈ యంగ్ బ్యూటీ తన ఉనికిని చాటుకుంటూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ఇక ఐశ్వర్య నందిని క్యారెక్టర్ కి చిన్నప్పటి వెర్షన్ లో సారా అర్జున్ నటించారు. ఇందులో విక్రమ్ తన ఫ్లాష్ బ్యాక్ ను వివరిస్తున్నప్పుడు సారా కొన్ని సెకండ్ల పాటు కనిపించి తనదైన అందం చందంతో చూపుర్లను గిలిగింతలు పెట్టింది..

ఇంతకు సారా అర్జున్ ఎవరు అంటే కొన్ని సంవత్సరాల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా దైవ తిరుమగల్ ( నాన్న) అనే సినిమాలో విక్రమ్ కూతురిగా నటించింది ఈమె.. ఇక అంతేకాదు చైల్డ్ ఆర్టిస్టుగా రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్, జై హో, ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె ఇప్పుడు ఈ సినిమాలో నటించి మరింత ఆకర్షిస్తోంది. ఇకపోతే హీరోయిన్ గా బాలీవుడ్ చిత్రం 404లో హీరోయిన్గా అరంగేట్రం చేయనుంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈ అమ్మాయి కృతి శెట్టి రేంజ్ లో దూసుకుపోవాలని అందరూ కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version