పంజాబ్ ముఖ్య మంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. పంజాబ్ గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించారు సీఎం అమరీందర్ సింగ్. గవర్నర్ కు సీఎం తో పాటు మంత్రులు కూడా రాజీనామా లేఖలు ఇచ్చారు. ఇక ఈ రాజీనామా ఎపిసోడ్ పై మరి కాసేపట్లో మీడియా తో అమరీందర్ సింద్ మాట్లాడనున్నారు. మంత్రులతో పాటు సీఎం అమరిందర్ సింగ్ వెంట ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గత కొన్ని రోజులుగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కలహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
మొన్నటి వరకు అయితే ఎప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలుతున్న అనే ప్రశ్న కూడా అందరిలోనూ మెదిలింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం… రంగంలోకి దిగడంతో… కాస్త చల్లబడ్డాయి పంజాబ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు. అయితే తాజాగా మరోసారి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్… మరియు పంజాబ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాజీనామా చేశారు అమరీందర్ సింగ్.