అందాల ‘ రాశి’ ఖన్నా… పరువాల విందు

-

అందాల రాశి ఖన్నా పరువాల విందు చేస్తోంది. తన లెటెస్ట్ గ్లామర్ ఫోటోలతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటన్నారు. బ్లూ రంగు డ్రెస్ లో తన గ్లామర్ సోయగాలను చూపిస్తోంది. కనిపించి కనిపించనట్లు ఎద అందాలతో ఎరవేస్తోంది. 

చాలా రోజుల తరువాత రాశిఖన్నా తన లెటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్ కు హీట్ పుట్టిస్తోంది. రాశి అందానికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. సో హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మొదట్లో స్కీన్ షోకు కొద్దిగా దూరం ఉంటే.. ఈ అమ్మడు ప్రస్తుతం గ్లామర్ షోకు వెనకాడటం లేదు. సినిమా రంగానికి వచ్చిన మొదట్లో కొద్దిగా బొద్దుగా ఉన్న రాశి ఖన్నా.. ప్రస్తుతం స్లిమ్ గా తయారైంది.

మీడియం రేంజ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా ఉన్న రాశికి.. అన్ని మామూలు సక్సెస్ లే అందాయి. పెద్దగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు లేదు. అయినా సినిమా అవకాశాలు తగ్గడం లేదు. 

ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ సినిమాతో పాటు ‘ థాంక్యూ’ సినిమాలో నటిస్తోంది. కొత్తగా తెలుగులో ఏ ప్రాజెక్ట్ లు లేవు. 

మరోవైపు తమిళంలో నాలుగు ప్రాజెక్ట్ లు ఉండగా.. హిందీలో ‘యోధ’ సినిమా చేస్తోంది. మరోవైపు వెబ్ సిరీస్ లలో  కూడా నటిస్తోంది. అజయ్ దేవ్ గన్ తో కలిసి ‘ రుద్ర – ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ వెబ్ సిరీస్ లో నటించింది. ఫ్యామిలీ మెన్ డైరెక్టర్లు రాజ్-డీకే చేస్తున్న మరో వెబ్ సిరీస్ లో కూడా రాశి ఖన్నాకు ఛాన్స్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version