పాదయాత్రకు రక్షణ కల్పిస్తారా? లేదో ప్రభుత్వమే తేల్చుకోవాలి : రఘునందన్‌రావు

-

మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రజలను కలుసుకోకూడదని సీఎం ఆలోచన దుర్మార్గం అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ‘‘18వ శతాబ్దంలో మహిళల హక్కులు, విద్య కోసం తమ జీవితాలను త్యాగం చేసిన దంపతులు పూలే దంపతులు. 1848లో సావిత్రిబాయి ఫూలే మహిళల విద్య కోసం పాఠశాల ప్రారంభం చేసిన గొప్ప మహానుభావులు. 21వ శతాబ్దంలో పూలే స్థాపించిన వారి పోరాటాలను ముగించాలంటే మహిళలందరికీ సమాన హక్కులు, సమాన విద్య, రాజ్యాధికారం వచ్చిన రోజే వారికి నిజమైన నివాళి.

దేశానికి తెలంగాణ పోలీసులు ఆదర్శం అని సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి గొప్పలు చెబుతారు. బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకి అనుమతులు ఇచ్చి చివరి నిమషంలో రద్దు అని చెప్పి అరెస్ట్ చేశారు. రాష్ట్ర హైకోర్టు.. పాదయత్రకి అనుమతి ఇవ్వడం శుభపరిణామం. కచ్చితంగా ప్రజల వద్దకు వెళ్లి వారి బాధలు తెలుసుకుంటాం. పాదయాత్రకు రక్షణ కల్పిస్తారా? లేదో ప్రభుత్వమే తేల్చుకోవాలి. లక్షలాది మంది పోలీసులు ఉండి పాదయాత్రకి అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? పోలీసుల నిర్ణయాన్ని కోర్టు తప్పుబట్టింది.’’ అని వ్యాఖ్యానించారు రఘునందన్‌రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version