ప్రత్యేక హోదా కోసం కాలర్ పట్టుకుంటామని చెప్పి … కాళ్లు పట్టుకున్నారు – రఘురామ

-

ప్రత్యేక హోదా కోసం కాలర్ పట్టుకుంటామని చెప్పి … కాళ్లు పట్టుకున్నారని జగన్‌ పై రఘురామ ఫైర్‌ అయ్యారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వం కాలర్ పట్టుకుని నిలదీస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉత్తర కుమారుడిగా సంబోధించిన ఆయన, ఇప్పుడు ఉత్త కుమారుడిగా మిగిలిపోయారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుకాసుర ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు ముగింపు పలుకుతారోనని, ఇసుకను, మట్టిని అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రాష్ట్రంలో రెండు సంస్థలను ముందు పెట్టి, ఇసుకను బహిరంగగానే వేలం వేసి అమ్ముకుంటున్నారని, తూర్పుగోదావరి జిల్లాలో 35 కోట్లు, శ్రీకాకుళంలో 18 కోట్లు టార్గెట్ విధించారని, తూర్పుగోదావరి జిల్లాలో ఆదాయం తగ్గిందని, వెసులుబాటు కావడం లేదని చెప్పినప్పటికీ, కర్కశంగా వ్యవహరించడం వల్ల ప్రేమ్ రాజు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version