రైల్వే శాఖ కారిటీ… మేము 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు !

-

ఈ మధ్యన నిరుద్యోగుల సమస్యను కొందరు తమ స్వార్ధాలకు మరియు టీ ఆర్ పి రేటింగ్స్ కోసం వాడుకుంటున్నారు. ఉద్యోగం అవసరం అనిపిస్తే ఎక్కడ జాబ్స్ ఖాళీ అని తెలిసినా లేదా ప్రభుత్వం నుండి ఎటువంటి నోటిఫికేషన్ విడుదల అయినా వెంటనే అప్లై చేసుకుంటారు. కానీ కొన్ని సార్లు అవి ఫేక్ నోటిఫికేషన్ లు అని తెలిస్తే ? ఎవరో స్వార్థానికి మనకు సోషల్ మీడియాలో వైరల్ చేశారు అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది.

ప్రస్తుతం తాజాగా జరిగిన ఒక విషయం దీనిని పోలి ఉంది. ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 20 వేల జాబ్స్ ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్త రైల్వే శాఖ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రైల్వే శాఖ నుండి ఎటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏదైనా నోటిఫికేషన్ ఉంటే మీరు అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. సోషల్ మీడియాలో వచ్చిన వాటిని నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news