Big News : హైదరాబాద్‌లో వర్షం.. జాడలేని సూర్యుడు..

-

మాండూస్‌ తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లో వాన కురుస్తున్నది. శనివారం సాయంత్రం నుంచి ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో రాత్రి నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో ముసురు పడుతున్నది. బంజారాహిల్స్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, సనత్‌నగర్‌, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌, నాంపల్లి, కోఠి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ వనస్తలిపురం తదితర ప్రాంతాల్లో వాన పడుతున్నది. కాగా, మాండూస్‌ తుఫాను వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా వర్షం కురుస్తున్నది. తెలంగాణలో మోస్తరుగా ఉన్నది. అయితే రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. ఉదయం 8 అయినా.. సూర్యుడు జాడ కనిపించలేదు. ఆకాశం మొత్తం మంచుతో కనిపించడంతో ఇళ్లలో నుంచి కూడా బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఉమ్మడి కడప జిల్లాలో తుపాన్‌ తీ వ్రత ఆందోళన చేస్తోంది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంకలు,వాగులు ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో ఇద్దరు చిన్నారులు,ఒక మహిళ మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని దర్జిపల్లె గ్రామంలో గోడ కూలి కొమ్ము పద్మావతి (50) మృతి చెందారు. రెం డ్రోజులుగా కురుస్తున్నవర్షానికి రేకులపాక నాని కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ట మండలం తాళబాద్‌ గ్రామంలో లె ట్రిన్‌ నిర్మాణం కోసం తవ్విన గుంతలో వర్షపు నీరు చేరడంతో ఇద్దరు చిన్నారులు శ్రావ్య (5), హర్ష (6)లు ఆడుకుంటూ తెలియక గుంతలో పడి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో వర్షాలు కొనసాగుతుండడంతో ఇలాంటి ప్రమాదాలు ఇంకెన్ని చోటు చేసుకుంటాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. శేషాచలం కొండల్లో కురుస్తున్నభారీ వర్షాలు కారణంగా గుండా యేరు ఉధృతంగా ప్రవహించి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోయింది.

 

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండడంతో మైలవరం రిజర్వాయర్‌ నుండి 3 వేల క్యూసెక్కుల నీరు పెన్నానదికి వదలడంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో రెం డ్రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కోత దశలో ఉన్న వరి, కల్లాల్లో ఉన్న ధాన్యం దెబ్బ తిననుంది. వీటితో పాటు పత్తి, వేరుశనగ, బుడ్డశనగ పంటలు మరో రెండ్రోజులు వర్షం కురవనున్నడంతో నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రెండుజిల్లాల కలెక్టరేట్లతో పాటు అన్ని రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version