భార‌త్, శ్రీ‌లంక మ్యాచ్‌కు వర్షం అంత‌రాయం

-

ఆసియా క‌ప్‌లో భార‌త్, శ్రీ‌లంక సూప‌ర్ 4 మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. 47వ ఓవ‌ర్‌లో చినుకులు మొద‌ల‌య్యాయి. దాంతో, ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు డ‌గౌట్‌కు ప‌రుగుతీశారు. అప్ప‌టికీ భార‌త జ‌ట్టు స్కోర్.. 197/9. అక్ష‌ర్ ప‌టేల్(15), మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌(1)తో ఆడుతున్నారు. పాకిస్థాన్‌పై దంచి కొట్టిన భార‌త టాపార్డ‌ర్ శ్రీ‌లంక స్పిన్ ఉచ్చులో ప‌డ్డారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించ‌డంతో లంక బౌలర్లు చెల‌రేగారు. దాంతో, భార‌త ఆట‌గాళ్లు వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. యువ స్పిన్న‌ర్ దునిత్ వెల్ల‌లాగే 5 వికెట్ల‌తో అద‌ర‌గొట్టాడు. తొలి నాలుగు వికెట్లు అత‌డే ప‌డ‌గొట్టాడు.

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలంగ్ చేయడంతో పరుగుల కోసం భారత బ్యాటర్లు శ్రమించారు. అయితే రోహిత్ శర్మ మాత్రం తనదైన ఆటను కనబరిచాడు. ఒక ఎండ్ లో శుబ్ మన్ గిల్ (19) పరుగుల కోసం తంటాలు పడుతుంటే.. రోహిత్ మాత్రం దూకుడు కనబరిచాడు. వీరిద్దరు తొలి వికెట్ కు 80 పరుగులు జోడించారు. అనంతరం వెల్లాలెగె ఎంట్రీతో కథ తారుమారైంది. అతడి బౌలింగ్ లో గిల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సెంచరీ హీరో విరాట్ కోహ్లీ (3) కూడా వెల్లాలెగెకు బలయ్యాడు. అర్ధ సెంచరీ చేసిన రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లను కోల్పోయింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version