కొర‌టాల శివ‌- ఎన్టీఆర్ సినిమాలో రాజ‌శేఖ‌ర్!

-

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ బిజీ బిజీ గా ఉన్నాడు. ఆయ‌న ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ఫైన‌ల్ స్టేజ్ లో ఉంది. అప్పుడే మరో సినిమాను డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ లైన్ లో పెట్టేశాడు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా త్వ‌ర‌లోనే ఒక కొత్త సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇటీవ‌ల వ‌చ్చింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ కొరటాల శివ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ రెండో సినిమాను నంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ క‌లిసి నిర్మిస్తున్నాయి.

గ‌తంలో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ ఎన్టీఆర్ సినీ కేరీర్ లో ఇండ‌స్ట్రీ హిట్ అయింది. ఇప్పుడో మ‌రో సారి రికార్డుల‌ను తిర‌గేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టుడెంట్ లీడ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. అయితే ప్ర‌స్తుతం ఈ సినిమా గురించి ఆస‌క్తి క‌ర‌మైన అప్ డేట్ అంటూ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

 

ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్ బాబాయ్ పాత్ర‌లో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. కీల‌కమైన పాత్ర కావ‌డం, క‌థ న‌చ్చ‌డంతో రాజ‌శేఖ‌ర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీని పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగ ప్రస్తుతం రాజ‌శేఖ‌ర్.. శేఖ‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version