హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బందును ఈసీ అడ్డుకుందని.. దళిత బందును ఎవరూ ఆపలేరని నవంబర్ 4 తర్వాత తానే స్వయంగా వెళ్లి దళిత బందు ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అయితే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడగా ఈటల రాజేందర్ విజయం సాధించారు. దాంతో బిజెపి నాయకులు కేసీఆర్ చెప్పినట్టుగా దళిత బంధును అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కెసిఆర్ ఎప్పుడు దళిత బంధు ను అమలు చేస్తారో చెప్పాలని అన్నారు. నవంబర్ 4 తర్వాత దళిత బందును ఎవరు ఆపలేరు అని గొప్పగా సీఎం ప్రకటించారని నవంబర్ 4వ తేదీ అయిపోయింది అని ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. మీ పార్టీ ప్లీనరీలో ఎన్నికల కోసం దళిత బందు తేలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. నా నియోజకవర్గంలోని దళితులు మీ దళిత బంధు కోసం ఎదురు చూస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలు అయిపోయాయని వెంటనే రాష్ట్రమంతా దళిత బంధుని అమలు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.