ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురువు : రామ్ చరణ్‌

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతి త్వరలో జరగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.అప్పటి నుండి యూఎస్ లో చరణ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఎపిక్ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్‌ యాక్షన్ డ్రామా RRRని మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లోని ఏస్ హోటల్ థియేటర్‌లో ప్రదర్శించడం జరిగింది. ఇక్కడికి రామ్ చరణ్‌తో పాటు ద‌ర్శ‌క దీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్‌ కుమార్ హాజరయ్యారు. RRR ప్ర‌ద‌ర్శ‌న పూర్త‌యిన వెంట‌నే యూనిట్ స‌భ్యుల‌ను థియేటర్లో చ‌ప్ప‌ట్ల‌తో గౌర‌వించారు. స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు.

ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ మాట్లాడుతూ ప్రేక్ష‌కులు చూపించే ప్రేమ‌, అభిమానుల ఆద‌ర‌ణే త‌న‌ను కెరీర్‌లో సుదీర్ఘ‌తీరాల‌కు న‌డిపిస్తుంద‌ని వెల్లడించారు. “మిగిలిన వాళ్ల‌కు కూడా ఇలాగే ఉంటుందా? లేకుంటే నాకు మాత్రం ఇలా ఉందో తెలియ‌దు. కానీ, నటుడిగా ఈ క్ష‌ణాల‌ను మ‌న‌స్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఈ క్ష‌ణాల కోస‌మే ఎంత కష్టమైనా పడ్డాను. ప్రేక్షకులు అందరినీ ఎంటర్టైన్ చేయాలనేదే నా ప్ర‌య‌త్నం. ఇలాంటి స్పంద‌నే నేను కోరుకున్నాను.

 

ఎన్టీఆర్ గురించి చ‌ర‌ణ్‌ మాట్లాడుతూ “ఇప్పుడు నేను, తార‌క్ బెస్ట్ ఫ్రెండ్స్. అందుకు ట్రిపుల్ ఆర్‌కి న హృదయపూర్వక వందనాలు. ట్రిపుల్ ఆర్ వ‌ల్ల మేం రోజు క‌లిసే వాళ్లం. చాలా స‌న్నిహితుల‌మ‌య్యాం. మ‌మ్మ‌ల్ని క‌ల‌పాల‌నే ఆలోచ‌న రాజ‌మౌళి గారికి వచ్చినట్టుంది. అందుకే మ‌మ్మ‌ల్ని ఇద్ద‌రినీ ట్రిపుల్ ఆర్ కోసం తీసుకున్నారు రాజమౌళి.
ట్రిపుల్ ఆర్‌లో తార‌క్ న‌టించ‌డం వ‌ల్ల సోద‌ర‌ భావాన్ని చూపించ‌డం తేలికైంది. త‌న‌తో క‌లివిడిగా ఉండ‌గ‌లిగాను” అని వ్యక్తపరిచారు చరణ్. తార‌క్‌ని ఆ వేదిక మీద బాగా మిస్ అవుతున్నానని రామ్ చరణ్ విచారం తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version