విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలు, కాలేజీలను ప్రభుత్వం గాలికొదిలేసిందని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వ హాస్టల్స్‌లోచదువుతున్న విద్యార్థుల ఆకస్మిక మరణాలు, ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా కేజీబీవీలో విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వసతి గృహంలో ఈనెల 11వ తేదీ రాత్రి నిద్రపోతున్న పదవ తరగతి విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు ఉదయం వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం.ఈ విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థినులను హాస్టల్స్ నిర్వాహకులు హెచ్చరించినట్టు తెలుస్తోంది.
కేజీబీవీలో విద్యార్థినులను కరిచిన ఎలుకలు
ప్రభుత్వ వసతి గృహాలను గాలికి వదిలేసిన ప్రభుత్వం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వసతి గృహంలో ఈనెల 11వ తేదీ రాత్రి నిద్రపోతున్న పదవ తరగతి విద్యార్థినులను ఎలుకలు కరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి… pic.twitter.com/Rpa0Od1s2h
— Telugu Scribe (@TeluguScribe) February 14, 2025