ప్రస్తుతం ఇండియా వేదికగా ఐపీఎల్ సీజన్ 16 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ తర్వాత జూన్ 7వ తేదీన లండన్ లోని ఓవల్ స్టేడియం లో ఆస్ట్రేలియా తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ వచ్చిన తర్వాత ఇండియా రెండవసారి ఫైనల్ కు చేరింది, కాగా గతంలో న్యూజిలాండ్ తో ఫైనల్ లో ఒదగా, ఈ సారి ఎలాగైనా ఛాంపియన్ షిప్ ను దక్కించుకోవాలని కసిగా ఉంది. ఈ టెస్ట్ లో పాల్గొనే జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో.. భిన్నపాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కాసేపటి క్రితమే మాజీ ఇండియా క్రికెట్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని తెలిపాడు.
బీసీసీఐ పై మాజీ ఇండియా కోచ్ ప్రశంసలు… బెస్ట్ టీం ఇదే !
-