రవితేజ ‘రావణాసుర’ నుంచి థీమ్ వీడియో సాంగ్

-

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ సస్పెన్స్ మూవీ రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 7 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దక్షా నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజితా పొన్నాడ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా ఆర్టి టీం వర్క్స్ సంస్థ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.

Ravanasura' theme song is out now - Telangana Today

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రావణా .. రావణా .. రావణా .. దశగ్రీవ .. రావణా’ అంటూ ఈ పాట సాగుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలోని ఈ పాటకి శ్రీహర్ష సాహిత్యాన్ని అందించగా అరుణ్ కౌండిన్య ఆలపించారు.
ఈ సినిమాలోని ఐదుగురు హీరోయిన్స్ లో ప్రధానమైన నాయిక ఎవరు? హీరో పాత్రకే నెగెటివ్ షేడ్స్ ఉంటే .. అసలు విలన్ ఎవరు? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలకు ఈ సినిమా మాత్రమే సమాధానం చెబుతుందనేది మేకర్స్ మాట. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news