BREAKING : నేడు రాయపట్నం పోర్టు పనులు ప్రారంభించనున్న సీఎం జగన్

-

రామాయపట్నం పోర్టు పనులను నేడు ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దీంతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం ఇవ్వనుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయ రహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు ఉండగా…పోర్టు తొలి దశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకుంది సర్కార్. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలి దశ పనులు ప్రారంభం కానున్నాయి.

ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును నిర్మించనున్న రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్…తొలి దశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం కానున్నాయి. ఏడాదికి 25 మిలియన్‌ టన్నుల ఎగుమతి కానుండగా…కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం చేపట్టనుంది. రెండో దశలో 138.54 మిలియన్‌ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం కానుండగా..

ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్‌ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానుంది రామాయపట్నం పోర్టు.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సులభతరం కానున్నాయి. బొగ్గు, ఇనుపఖనిజం, గ్రానైట్, ఆహార ధాన్యాలు, బియ్యం సహా ఇతర ధాన్యాలు, సిమెంటు, ఫెర్టిలైజర్స్, పొగాకు, మిర్చి, ఆక్వా ఉత్పత్తులు, కంటైనర్లు తదితర రవాణాలో కీలకం కానుంది రామాయపట్నం పోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news