RC 15 : సీఎంగా రామ్‌చరణ్..!

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తు్న్నారు. ఈ పిక్చర్ నుంచి ఏదేని అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR ఫిల్మ్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. కాగా, ఇందులో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది.

అయితే ఈ చిత్రానికి.. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. దాంతో గతంలో అధికారి, స‌ర్కారోడు వంటి టైటిల్స్‌ తెరపైకొచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమా టైటిల్స్ రేసులో మ‌రో కొత్త టైటిల్ వచ్చి చేరింది. ఇటు మాస్‌.. అటు క్లాస్ ఆడియెన్స్‌కి న‌చ్చేలా ఈ చిత్రానికి సీఎం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇక్క‌డ సీఎం అంటే చీఫ్ మినిస్ట‌ర్ అనే అర్థంలో కాకుండా.. కామ‌న్ మ్యాన్ అని తీసుకోబోతున్నారట. షార్ట్‌గా పవర్ ఫుల్‌గా ఉండడంతో.. ఈ టైటిల్ క్యాచీగా ఉంటుందని భావిస్తున్నారట. పైగా సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. దాంతో సీఎం టైటిల్ ఫర్ఫెక్ట్‌గా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news