Breaking : హైద‌రాబాద్‌కు రెడ్ అల‌ర్ట్‌.. అతి భారీ వ‌ర్షాలు

-

గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ తాజాగా మరో ప్రకటన చేసింది. రాబోయే మూడు రోజుల పాటు హైద‌రాబాద్ న‌గ‌రానికి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది వాతావ‌ర‌ణ శాఖ. తెలంగాణ‌లోని 14 జిల్లాల‌కు కూడా భారీ వ‌ర్ష సూచ‌న ఉన్నట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.Telangana Rain Alert: అలుగుపారుతున్న చెరువులు.. మరో 3రోజుల పాటు భారీ  వర్షాలు – NTV Telugu

ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావంతో రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. అయితే భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లాల‌ని సూచించింది వాతావ‌ర‌ణ శాఖ. అవ‌స‌ర‌మైతేనే ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని, ఇప్ప‌టికే కురిసిన భారీ వ‌ర్షాల‌కు రాష్ట్రంలోని అన్ని జ‌లాశ‌యాల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చిందని వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news