పెంపుడు కుక్క‌ను న‌మోదు చెయ్యకపోతే.. రూ. 50 వేల దాకా జ‌రిమానా…!

-

మీ పెంపుడు కుక్క‌ను న‌మోదు చెయ్యాలి. లేదంటే జరిమానాని కట్టాల్సి వస్తుంది. కనుక వెంటనే జీహెచ్ఎంసీలో న‌మోదు చేసుకోండి. ఒకవేళ నమోదు చెయ్యకుండా బ‌య‌టికి తీసుకెళితే రూ.1000 నుంచి రూ.50,000 దాకా జ‌రిమానా పడుతుంది. అలానే ఒకవేళ జీహెచ్ఎంసీ అధికారులు మీ ఇళ్ళకి వచ్చి చూసినప్పుడు న‌మోదు చేయ‌లేద‌ని తెలిస్తే ఫైన్ కట్టాలి.

న‌గ‌రంలో ప్ర‌స్తుతం దాదాపు 50 వేల పెంపుడు కుక్క‌లున్నాయి. అందులో కేవ‌లం 500 వ‌ర‌కూ మాత్ర‌మే న‌మోదయ్యాయి. అందుకే ఇంత కఠినమైన రూల్స్ ని తీసుకు వచ్చింది. అలానే నిబంధ‌న‌ల ప్ర‌కారం, ప్ర‌తి కుక్క‌కు రేబిస్ టీకా వేయించాలి. అయితే కొంత మంది కుక్క‌ను పెంచుకున్నంత కాలం పెంచుకుని, పొర‌పాటున ఏదైనా రోగం కానీ సమస్య కానీ వస్తే వదిలేస్తున్నారు.

ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికే జీహెచ్ఎంసీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రిజిస్ట‌ర్ చేసుకోవాలి అంటే రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు తాజాగా కుక్క‌కు వేయించిన వ్యాక్సీనేష‌న్ స‌ర్టిఫికెట్ అంద‌జేయాలి.

నివాస ధృవీక‌ర‌ణ ప‌త్రం, మీ ఇంటి ప‌క్క‌వారి నుంచి నిర‌భ్యంత‌ర ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వాలి. రిజిస్ట్రేష‌న్ అయ్యాక ప్ర‌త్యేక నెంబ‌రును కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ వెట‌ర్న‌రీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ లేదా డిప్యూటీ డైరెక్ట‌ర్ లైసెన్సును ఇస్తారు.

పెట్ లైసెన్స్ అప్లికేషన్ కోసం ముందు https://pet.ghmc.gov.in/pl/mobile_validate లోకి వెళ్ళాలి.
నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చెయ్యాలి.
జెనరేట్ ఓటీపీ మీద క్లిక్ చెయ్యాలి.
నెక్స్ట్ ఓటీపీని ఎంటర్ చెయ్యండి.
ఇక్కడ మీరు మీ పేరు, అడ్రెస్, మొబైల్ నెంబర్ వంటి వివరాలని ఎంటర్ చెయ్యాలి.
ఆ తర్వాత మీ పెంపుడు కుక్క తాలూకా వివరాలని ఎంటర్ చెయ్యాలి.
అలానే నెక్స్ట్ మీ పెంపుడు కుక్క తాలూకా ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. అలానే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ని కూడా అప్లోడ్ చెయ్యాలి.
యాభై రూపాయల్ని పే చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చెయ్యాలి.
అప్రూవల్ అయ్యాక లైసెన్స్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version