(సందర్భం : మే 30 వర్ధంతి)
నాగమల్లి తోటలో మేం ఆగమాగమైపోయాం అని ప్రశ్నించిన
మీ గొంతు విని పరవశించిపోయాం
రక్తంతో నడుపుతాను రిక్షాను అంటే మేం పులకించిపోయాం..
పీపుల్ స్టార్ ని అందించిన మీరు ఇలా వెళ్లిపోయారేంటి సర్
విన్నవించు నా చెలికి మేఘ సందేశం అని
ఇలా ఆకాశ దేశానికి ప్రయాణమయ్యారేంటి సర్
మేస్త్రీ వి మిస్ యూ.
…………………………
ఉదయం రాదు
బొబ్బిలి పులి గాండ్రించదు
శివరంజని వినిపించదు
ఏంటో అన్నీ అన్నీ అలానే ఆగిపోయాయ్
ఎందుకనో ఓ సెన్సేషనిజం సైలెంట్‌గా సైడ్ అయిపోయె!
…………………………
ఔను! ఇప్పటికీ గుర్తు కొందరికి మీరు జీవితాన్ని ఇచ్చారు
కోటప్ప కొండ సాక్షిగా కొందరి ఎదుగుదలకు కారణమయ్యారు
పతంజలి లాంటి జర్నలిస్టులకు లిఫ్ట్ ఇచ్చారు. రామకృష్ణారెడ్డి, నాంచారయ్య, కె.శ్రీనివాస్ అండ్ కో
ఇప్పుడెంత బాధపడుతుంటారో..!
…………………………
ఏం లేద్సార్ మీరు మళ్లీ ఉదయిస్తే చూడాలన్నది మా కోరిక
మీ పత్రిక మీ అక్షరం మళ్లీ మళ్లీ పురుడు పోసుకోవాలన్నది మా చిరకాల వాంఛ
ఓ మోహన్ బాబు, ఓ ఆర్ నారాయణ మూర్తి ఓ అశోక్ తేజ ఇలా ఒక్కరని కాదు అందరి మనసు వాకిటా ఇదే తలంపు
మేస్త్రీ వి మిస్ యూ
…………………………
సగటు సినీ జీవి మీ గురించి ఏం అనుకున్నా ఇప్పుడది అప్రస్తుతం
రాములమ్మని కెరియర్ మీరు ఏ విధంగా మలిచారన్నదే మాకు ముఖ్యం
మిమ్మల్ని వద్దనుకున్న హీరోలు మీ దగ్గర ఎలా అవకాశాలు పొంది స్టార్లు అయ్యారో అన్నదే కీలకం
ఎనీవే మేస్త్రీ వి మిస్ యూ
– రత్నకిశోర్ శంభుమహంతి