దమ్ముంటే అమరావతి పేరు ‘కమ్మరావతి’ అని పెట్టండి… సీఎం జగన్ కు రేణుకా చౌదరి సవాల్

-

మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా వర్నిలో జరిగిన తెలంగాణ కమ్మ సేవా సమితి ఆద్శర్యంలో జరిగిన సమావేశంలో ఆమె సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పొరపాటున ముఖ్యమంత్రి అయ్యారంటూ… అమరావతిని కమ్మరావతి అంటూ హేళన చేస్తున్నారని విమర్శించారు. నువ్వు చదువుకున్నవాడివైనా అమరావతికి, కమ్మవారికి ఉన్న గత చరిత్ర ఏమిటో నీకు అర్థం కాదని విమర్శించారు. మీకు నిజంగా దమ్ముంటే అమరావతికి ‘ కమ్మరావతి’ పేరు పెట్టరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు నీకు తెలిసి వస్తుందని అన్నారు. సీఎం బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మంచి తనం బలహీనం కాదని హెచ్చరించారు. ఓ రంగు పూసి మమ్మల్ని వెనక్కి తోయాలంటే భయపడతామా..? అని వ్యాఖ్యానించారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. సోమరిపోతులుగా తయారుచేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version