ఏపీ: గణేష్ ఉత్సవాలపై ఆంక్షలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీజేపీ రెడీ..

-

కరోనా మూలంగా పండగలకు కూడా నిబంధనలు తప్పడం లేదు. రానున్న గణేష్ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించకుండా ఉండాలని, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ, ఇంట్లోనే పండగను జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆంధ్రప్రదేశ్ లోని కరోనా పరిస్థితుల మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నిరసనలు చేస్తుంది. హిందూ పండగలపై ఆంక్షలు విధిస్తున్నారంటూ విమర్శలు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

స్కూళ్ళు కాలేజీలకు లేని కరోనా పండగలకే వచ్చిందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడానికి బీజేపీ రెడీ అవుతుంది. పందిళ్ళు వేసుకుని గణేష్ ఉత్సవాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం, కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట జరగనుంది. మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version