కేసీఆర్, మోదీ ఇద్దరిదీ ఒకే బాట : రేవంత్‌ రెడ్డి

-

నేడు కాంగ్రెస్‌ చేపట్టిన చలో రాజ్‌ భవన్‌ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేతల నిరసన జ్వాలులు ఎగిసిపడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు రేణుకా చౌదరి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులను అరెస్ట్ చేశారు. కాగా, బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రాన్ని సంతృప్తి పరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేయించిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రహస్య ఆదేశాలతోనే తమ శాంతియుత ర్యాలీని పోలీసులు భగ్నం చేశారని, తద్వారా నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా నాటి కాంగ్రెస్ సర్కారు ఇలాగే వ్యవహరించి ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవాళ్లు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ ఇద్దరిదీ ఒకే బాట అని విమర్శించారు రేవంత్ రెడ్డి. నేడు కాంగ్రెస్ శ్రేణులపై దాడులను నిరసిస్తూ, రేపు (శుక్రవారం) జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. అటు, పోలీసుల లాఠీచార్జిలో గాయపడి ఆసుపత్రిపాలైన టీపీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ చామలను రేవంత్ రెడ్డి పరామర్శించారు. కిరణ్ కుమార్ త్వరగా కోలుకోవాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version