రాజకీయాల్లో కొందరు నాయకుల మాటలని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి..అసలు కొందరు మాటలకు ప్రజల్లో పెద్ద విలువ కూడా ఉండదు.. కానీ కొందరు నేతల మాటలు విలువ చాలా ఉంటుంది…వారి మాటలని జనం బాగానే పట్టించుకుంటారు. వారే మాట్లాడే ప్రతి మాట వెనుక రాజకీయ కోణం పెద్దగానే ఉంటుంది. అలాంటి నేతల మాటలని లైట్ తీసుకోకూడదనే చెప్పాలి.
అలా తెలంగాణ రాజకీయాల్లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలని సైతం లైట్ తీసుకోవడానికి వీల్లేదనే చెప్పాలి..అయినా రేవంత్ మాటలని ప్రజలు బాగానే పట్టించుకుంటారు…ఆయన చెప్పే ప్రతి మాటని గమనిస్తారు..ఎందుకంటే రాజకీయంగా రేవంత్ రెడ్డికి మంచి సబ్జెక్ట్ ఉంది…వాక్చాతుర్యం ఉంది. ఇలా రాజకీయంగా మంచి పట్టున్న రేవంత్ రెడ్డి తాజాగా…కులాల పైన కామెంట్లు చేశారు. సాధారణంగా ఆంధ్రాలో ఉన్నట్లు తెలంగాణలో కులాలపై పెద్దగా రాజకీయం జరగదు. అసలు ఏపీలో ఏ విధంగా కులాల పైన రాజకీయం నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు.
అయితే తెలంగాణ వచ్చాక…ఇక్కడ కూడా కులాల ఆధారంగా రాజకీయ నాయకులు రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మరింత ఎక్కువగా కులాల పరంగా రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు అదే కీ పాయింట్ తో రేవంత్ రాజకీయం చేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది. రేవంత్ తాజాగా వెలమ, రెడ్డి కులాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుంచో వెలమలు, రెడ్లకు పొసగదని, రెడ్లకు అవకాశం ఇస్తే..రాజకీయ పార్టీలు ఎలా గెలవవో చూస్తా అని రేవంత్ మాట్లాడారు. అంటే రెడ్లకు అవకాశం అంటే ఈ సారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని రేవంత్ చెబుతున్నారు. అలాగే వెలమ కులం ఎవరికి సంబంధించిందో అందరికీ తెలిసిందే.
పైగా రాష్ట్రంలోని రెడ్లు కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేయాలనే రీతిలో రేవంత్ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే రెడ్లు…టీఆర్ఎస్ లో ఉన్నారు..బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు వారంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే కాన్సెప్ట్ రేవంత్ రెడ్డిది అని చెప్పొచ్చు. మొత్తానికి రాజకీయాల్లో కీ పాయింట్ అయిన కులాలని తెరపైకి తీసుకొచ్చి రేవంత్ పోలిటికల్ గేమ్ బాగానే ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు.