BREAKING : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..వారీ జీతాలు ఇవ్వండి

-

BREAKING : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..రాశారు. హోం గార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి జీతాల వెంటనే అందించాలని.. తెలంగాణ ఆవిర్భావం నాడు రూ.16 వేల కోట్ల మిగులుతో, ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల మీ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్ధితికి చేరుకుందని లేఖలో పేర్కొన్నారు. విలువైన భూముల అమ్మకం, లక్షల కోట్ల అప్పులు… అది చాలదన్నట్టు ఇటీవల ప్రజలపై పలు రకాల పన్నుల భారం మోపారని.. నిప్పులు చెరిగారు.

ఒకవైపు అప్పుల ద్వారా, మరోవైపు భూముల అమ్మకం ద్వారా, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా, కరెంట్ ఛార్జీల పెంపు ద్వారా, భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ద్వారా, బస్ ఛార్జీల పెంపు ద్వారా, అడ్డు అదుపులేని మద్యం అమ్మకాల ద్వారా జనంపై ఎడాపెడా భారం మోపి, ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో, ఏ బడా కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుతున్నాయో తెలియని పరిస్థితి ఉందని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని మీరే చెబుతారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి పరిహారాలు పంచి వస్తారు. రూ.200 కోట్లు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా పత్రికల్లో మీరేదో మహానేత అయినట్టు ప్రకటనలు ఇచ్చుకుంటారని నిప్పులు చెరిగారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, రైతులకు రైతుబంధు నిధులు ఇంకా విడుదల చేయలేకపోవడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఎంత గొప్పగా ఉందో తెలుస్తోంది. మీ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాళీ తీసిందన్న విషయం అర్థమవుతోందని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version