సీఎం కేసీఆర్‌ కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి బహిరంంగ లేఖ రాశారు. సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే విధంగా విడుదల చేసిన జీవో 317ని ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని లేఖలో డిమాండ్‌ చేశారు. సీనియర్ ఎంప్లాయీస్ అర్బన్ జిల్లాలను ఎంచుకుంటుండగా, జూనియర్ ఉద్యోగులు రూరల్ జిల్లాలకు అలాట్ అవుతున్నారని… మూడేండ్లలో రిటైర్మెంట్ జరిగి ఖాళీలు ఏర్పడితే.. జూనియర్ ఉద్యోగులు అలాట్ అయిన జిల్లాల్లో ఇంకో 30 ఏండ్ల వరకు ఖాళీలు ఏర్పడే చాన్స్ ఉండదన్నారు.

దీంతో ఆయా జిల్లాల నిరుద్యోగులకు నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్నారు. జిల్లా కేడర్ మొత్తం ఉద్యోగుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏండ్ల పైబడిన వారు 60 వేల పైచిలుకు ఉంటారని అంచనా. ఫలితంగా దాదాపు 60 వేల ఉద్యోగాలను గ్రామీణ నిరుద్యోగులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు రేవంత్‌ రెడ్డి. ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గదర్శకాలను రద్దు చేయాలని… ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలతో చర్చించిన తర్వాత రూపొందించే నూతన గైడ్ లైన్స్ ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు ఇప్పటి వరకు జీవో నెంబర్ 3 ప్రకారమే జరిగాయని… కాబట్టి ప్రస్తుతం కూడా జీవో నెంబర్ 3 ఆధారంగానే బదిలీలు చేపట్టాలని వెల్లడించారు. ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని… భవిష్యత్లో ఏర్పడే ఖాళీలలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలన్నారు. అవసరమైతే జూనియర్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని… ఉపాధ్యాయుల కేటాయింపునకు కౌన్సిలింగ్ విధానాన్ని అనుసరించాలని డిమాండ్‌ చేశారు. బదీలల సమయంలో ప్రతి జిల్లాలో ఉన్న ఖాళీలను చూపించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news