కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..!

-

కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపించి నువ్వు ఓట్లు అడుగు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ ను చూపించి నువ్వు ఓట్లు అడుగుతావా..? అని సవాల్ విసిరారు. లక్ష కోట్లు దిగమింగి.. మూడేండ్ల కింద కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగదీసి.. అన్నారం ప్రాజెక్ట్ పగులగొట్టారు. దమ్ముంటే కేసీఆర్ నా సవాల్ స్వీకరించాలి. నిజామాబాద్ రూరల్ లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు రావని అంటున్నాడు.. కేసీఆర్..

తెలంగాణలో కాంగ్రెస్ 80 సీట్ల కంటే ఒక్క సీటు కూడా తగ్గకుండా 80కి పైగా సీట్లు ఇస్తారని జోష్యం చెప్పారు. నువ్వు వేసే శిక్షకు నేను సిద్ధంగా ఉంటానని తెలిపారు. అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నాడు. పదేళ్లలో తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. వాళ్ల ఫ్యామిలీకే పదవులు కట్టబెట్టారని.. వాళ్ల కుటుంబమే బాగుపడింది.. పేదలు పేదలుగానే మిగిలిపోయారు. కేసీఆర్ లక్షలాది కోట్ల డబ్బును వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version