రేవంత్ రెడ్డి ఎఫెక్ట్: ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్‌లోకి వస్తున్నారా?

-

రాజకీయాల్లో పార్టీ మార్పులు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రతిపక్షంలో ఉండే నాయకులు అధికారం కోసం ఆశపడి జంపింగులు చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి జంపింగులు సహజంగానే జరుగుతాయి. కానీ అలా వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఏదో ఎన్నికల సమయంలో తప్ప, మిగతా సమయాల్లో అది సాధ్యం కాదు. కానీ అది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సాధ్యం అవుతుందని ప్రచారం జరుగుతుంది.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది అధికార టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అలాగే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. అలా వెళ్ళిన ఎమ్మెల్యేలని ప్రస్తుత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. తమ పదవులకు రాజీనామా చేయకుండా టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలని రాళ్ళతో కొట్టాలని రేవంత్ రెడ్డి అంటున్నారు.

రేవంత్ రెడ్డి /revanth reddy
రేవంత్ రెడ్డి /revanth reddy

ఆ 12 మందిపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని లేదంటే, స్పీకర్‌పై న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు. ఇలా ఎమ్మెల్యేల టార్గెట్‌గా రేవంత్ రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావడం, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్‌కు పుంజుకునే ఛాన్స్ రావడంతో, కొందరు టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ సొంతగూటికి వచ్చేందుకు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే దానం నాగేందర్ తిరిగి వస్తారని కథనాలు వచ్చాయి. ఆ కథనాలని నాగేందర్ ఖండించి, తాను టీఆర్ఎస్‌లో కొనసాగుతానని చెప్పారు. అలాగే ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ సైతం తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని, ఆల్రెడీ హరిప్రియ దంపతులు రేవంత్‌కు టచ్‌లోకి వచ్చారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news