హిందీ ‘జెర్సీ’పై RGV కామెంట్స్..నాని అలా చేయాల్సిందని సూచన

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..తనకు నచ్చిన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా ఎప్పటికప్పుడు చెప్తుంటాడు. ఈ క్రమంలోనే వివాదాల్లో ఇరుకుంటారు. అలా తన ఆర్గుమెంట్స్ చేస్తూ ఎప్పుడూ మీడియాలో హైలైట్ అవుతుంటాడు. తాజాగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన ‘జెర్సీ’పైన ఆయన ట్వీట్ చేశారు.

నేచురల్ స్టా్ర్ నాని-గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కిన స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాను హిందీలో రీమేక్ చేశారు. గౌతమ్ తిన్ననూరియే ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అల్లు అరవింద్, నాగవంశీ ప్రొడ్యూర్ చేశారు. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్ గా నటించారు.

తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ ఫిల్మ్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కాగా, హిందీలో ఆ మ్యాజిక్ వర్కవుట్ అయినట్లు లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే RGV హిందీ ‘జెర్సీ’పైన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో నాని ‘జెర్సీ’ మూవీని బాలీవుడ్ కు డబ్ చేసి ఉంటే కనుక ప్రొడ్యూసర్స్ కు రూ.10 లక్షలు ఖర్చయ్యేదని, అలా చేయకపోవడం వలన నిర్మాతలు హిందీలో రీమేక్ చేశారని, అందుకు రూ.100 కోట్లు ఖర్చు..సమయం, శ్రమ వృథా అయ్యాయని ట్వీట్ లో పేర్కొన్నారు.

డెత్ ఆఫ్ రీమేక్స్ అని హ్యాష్ ట్యాగ్ తో #DeathOfRemakes ఈ ట్వీట్ చేశారు వర్మ. అలా బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ పైన ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశారు వర్మ. ‘‘KGF, పుష్ప, RRR’ లాంటి డబ్బింగ్ సినిమాలు బాలీవుడ్ ఒరిజినల్ సినిమాల్ని తలదన్నేలా సూపర్ హిట్టయ్యాయని, ఈ విషయం చాలా సార్లు నిరూపించబడిందని’’ మరో ట్వీట్ చేశారు వర్మ. వర్మ ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందింస్తున్నారు. హిందీ ‘జెర్సీ’ నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version