గుడివాడ క్యాసినోపై RGV సంచలన ట్వీట్‌.. మొదట ఎన్టీఆర్ ను అడగండి !

గత మూడు రోజుల ఏపీ రాజకీయాల్లో గుడివాడ క్యాసినో హాట్‌ టాపిక్‌ గా నడుస్తోంది. ఏపీ మంత్రి కొడాలి నాని సంక్రాంతి పండుగ నేపథ్యంలో… తన ఫంక్షన్‌ హాల్‌ లో క్యాసినో నిర్వహించాడని టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. తాను అలాంటి చిల్లర పనులు చేయడం లేదని అటు మంత్రి కొడాలి నాని కౌంటర్‌ ఇస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి.

ఈ నేపథ్యంలో.. గుడివాడ క్యాసినోపై RGV సంచలన ట్వీట్‌ చేశారు. “కొడాలి నాని కంటే ముందు గుడివాడ క్యాసినో లైఫ్‌ గురించి గ్రేట్‌ జయ మాలిని ద్వారా విన్నా. ఎన్టీఆర్‌ తన సినిమాలో ఆ పాటను అనుమతించారు. కాబట్టి క్యాసినో పై కొడాలి నానిని ప్రశ్నించే ముందు టీడీపీ పార్టీ నేతలు ముందుగా ఎన్టీఆర్‌ గారిని ప్రశ్నించాలి” అంటూ యమగోల సినిమాలోని ” గుడివాడ వెళ్లాను ” వీడియో సాంగ్‌ను దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.