లైగర్‌ ఫ్లాప్‌ అవ్వడానికి అదే కారణమట!

-

విజయ్‌ దేవరకొండ నటించిన ‘లైగర్‌’ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన కామెంట్స్‌ చేశారు. లైగర్‌ సినిమా ప్రేక్షకాదరణ పొందకపోవడానికి విజయ్‌ దేవరకొండ దూకుడు స్వభావం కారణం కావచ్చని ఆయన అన్నారు. ఇక బాలీవుడ్‌లో ఈ సినిమా పరాజయం పొందడానికి కరణ్‌ జోహర్‌ కారణమని వర్మ కామెంట్‌ చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘‘ విజయ్‌ స్టేజీపై సహజంగానే దూకుడుగా ఉంటాడు. అందరినీ ఆకర్షించాలని రకరకాల చేష్టలు చేస్తుంటాడు. కానీ, బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ లైగర్‌ ఉద్యమం రావడానికి ప్రాథమిక కారణం కరణ్‌ జోహర్‌. అతనికి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉండడం వల్లే బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించలేదు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌ ప్రజలు కరణ్‌ సినిమాలను బహిష్కరించడం సర్వసాధారణమైంది’’.

‘‘ఇక మరొక కారణం వినయం. హిందీ ప్రేక్షకులు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, ప్రభాస్‌ల వినయానికి మంత్రముగ్ధులయ్యారు. సౌత్‌ ఇండియన్‌ స్టార్లు ఒద్దికగా ఉండడాన్ని చూసి హిందీ ప్రేక్షకులు ఆశ్యర్యపోయారు. బాలీవుడ్‌లో అలా ఉండేవాళ్లు చాలా తక్కువ మంది. అంతే కాకుండా లైగర్‌ ఈవెంట్‌లలో విజయ్‌ మాటతీరు వారికి అంతగా నచ్చి ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు’’

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటించిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మూవీ ‘లైగర్‌’ ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ పరాజయాన్ని చవి చూసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version