టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఓ విషయం పై ఏదో ఓ ట్వీట్ చేస్తూ… వివాదాలకు తెర లేపుతుంటారు.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ పై సినిమాలు చేయడమే కాకుండా… రెగ్యులర్ గా అక్కడి రాజకీయాలపై కామెంట్ చేస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ.
ఇది ఇలా ఉండగా… ఇటీవలే.. తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ను వర్మ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కొండా అనే టైటిల్ ను కూడా ఈ సినిమాకు పెట్టారు. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ఆర్జీవీ ఓ నక్సలైట్ గెటప్ లో వచ్చి అందరినీఈ ఆశ్చర్యపరిచాడడు. నక్సలైట్ గెటప్ తో ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ పార్టీకి కొండా మురళి, సురేఖ కూడా వచ్చారు. ఈ సందర్భంగా వారితో వర్మ ఫోటోలు దిగి రచ్చ చేశారు.