టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ గా రిషబ్‌ పంత్‌ !

-

టెస్టు కెప్టెన్సీకి రెండు రోజుల కిందట విరాట్‌ కోహ్లీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ ఓడిపోయిన 24 గంటల వ్యవధిలోనే.. విరాట్‌ కోహ్లీ.. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అందరూ షాక్‌ కు గురయ్యారు. అయితే.. కోహ్లీ తప్పుకోవడంతో తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్ ఎవరనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు క్రికెట్‌ విశ్లేషకులు కొన్ని పేర్లను సూచిస్తున్నారు.

ఇందులో రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్, బుమ్రా లాంటి వాళ్ల పేర్లు ఉన్నాయి. టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్‌ ఎవరనే అంశంపై తాజాగా భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ స్పందించారు. ఓ క్రీడా చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత జట్టు తర్వాతి టెస్టు కెప్టెన్‌ గా యువ ఆటగాడైన వికెట్‌ కీపర్‌ రిషత్‌ పంత్‌ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. యువ ఆటగాడైన పంత్‌ కు అవకాశం ఇస్తే.. భారత జట్టుకు సుదీర్ఘ కాలం పంత్‌ కెప్టెన్‌ గా ఉండడానికి అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. మరి బీసీసీఐ ఎలాంటి నిర్నయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version