నారీ దీక్షల పేరుతో టీడీపీ దొంగ దీక్షలు చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. లోకేష్ పీఏపై వచ్చి అభియోగాలను పక్కదారి పట్టించేందుకే నారీ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలోనే మహిళలపై దాడులు జరిగాయని.. ఆమె దుయ్యబట్టారు. ఆడపిల్ల క్షోభపడుతూ చనిపోయిందని.. నారీ దీక్షటీడీపీ నేత వినోద్ జైన్ ఇంటి ముందు చేయాలని సూచించారు. టీడీపీలో నారీ నరకాసురులు, నారీ కామాంధులు ఎక్కవైపోయారని రోజా విమర్శించారు.