టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డికి ఆక్సిడెంట్.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మొట్ట మొద‌టి డిప్యూటీ స్పీక‌ర్, ప్ర‌స్తుత ఎమ్మెల్యే ప‌ద్మా దేవేందర్ రెడ్డికి ఆక్సిడెంట్ అయింది. ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ప్ర‌యాణిస్తున్న కారును వెన‌క నుంచి మ‌రొక కారు బ‌లంగా ఢీ కొట్టింది. దీంతో ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి కారు కొంత ఎత్తులోకి గాల్లో ఎగ‌రి కింద ప‌డింది. దీంతో ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ప్ర‌యాణిస్తున్న కారు ధ్వంసం అయింది. కాగ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవ‌డంతో వ్య‌క్తిగ‌త సిబ్బంది, కార్య‌క‌ర్త‌లు ఊపిరి పీల్చుకున్నారు.

కాగ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డికి ఈ రోడ్డు ప్ర‌మాదం మెద‌క్ జిల్లా అక్క‌న్న పేట రైల్వే గేటు వ‌ద్ద జ‌రిగింది. కాగ నేడు ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి.. మెద‌క్ ప‌ట్ట‌ణంలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గోంది. అనంత‌రం.. రామాయంపేట్ లో ఒక వివాహా కార్య‌క్ర‌మానికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకంది.

కాగ ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి గానీ, ఆ కారులో ప్ర‌యాణిస్తున్న ఇత‌రుల‌కు గానీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు.. ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని అనుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version