‘కారు’ని డ్యామేజ్ చేస్తున్న ‘గులాబీ’లు!

-

టీఆర్ఎస్ గుర్తు కారు..ఆ పార్టీ జెండా కలర్ గులాబీ…అంటే రెండు టీఆర్ఎస్ పార్టీవే..అలాంటప్పుడు కారుని గులాబీలు నాశనం చేయడం ఏంది అనుకోవచ్చు..అంటే ఇక్కడ పెద్ద లాజిక్ ఏమి లేదు. టీఆర్ఎస్ పార్టీని సొంత వాళ్లే నాశనం చేస్తున్నారన్నట్లు. ఓ వైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గులాబీ పార్టీకి చెక్ పెట్టడానికి రెడీ అవుతున్నాయి..కానీ ఆ అవకాశం సొంత పార్టీ వాళ్లే తీసుకునేలా ఉన్నారు.

ఇప్పటికే తమ పనితీరుతో ఎమ్మెల్యేలు..పార్టీకి బాగానే డ్యామేజ్ చేశారు. ఇక సీట్ల గొడవతో మరికొంత నాశనం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. సీటు విషయంలో నేతల మధ్య రగడ జరుగుతుంది. ఇక సీటు ఒకరికి ఇస్తే…మరొక వర్గం సహకరించే పరిస్తితి లేదు. దీని వల్ల టీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం జరిగేలా ఉంది.

ఇక ఇదొక ఎత్తు అయితే…టీఆర్ఎస్ లో కొందరు ఎమ్మెల్యేల వైఖరి మరీ వింతగా ఉందట. సొంత పార్టీ వాళ్ళని పట్టించుకోకుండా ప్రత్యర్ధి పార్టీ కార్యకర్తలకు అండగా ఉండటంలో కొందరు ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ నుంచి వచ్చి చివరి నిమిషంలో కోదాడ టీఆర్ఎస్ సీటు దక్కించుకుని, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిపై స్వల్ప మెజారిటీతో గెలిచి మల్లయ్య ఎమ్మెల్యే అయ్యారు.

ఇలా లక్కీగా ఎమ్మెల్యే అయిన మల్లయ్య…సొంత పార్టీని కలుపుకుని వెళ్ళడం లేదని తెలుస్తోంది. అదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ,…కోదాడ మున్సిపాలిటీ మెంబర్లతో మల్లయ్యకు పడటం లేదు. అసలు సొంత వాళ్ళని ఏ మాత్రం పట్టించుకోకుండా మల్లయ్య ముందుకెళుతున్నారని, స్థానిక ప్రజాప్రతినిధులు రగిలిపోతున్నారని తెలుస్తోంది…పైగా కాంట్రాక్టులు ప్రత్యర్ధి పార్టీలోని వారికి దక్కేలా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇలా సొంత పార్టీ నేతలకు, మల్లయ్యకు మధ్య గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ మల్లయ్యకు మళ్ళీ సీటు ఇస్తే సొంత పార్టీ వాళ్లే ఓడించేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version