రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’మేకింగ్‌లో బీభత్సం.. అదిరిపోయిన సీన్స్

-

రాజమౌళి ‘త్రిపుల్ ఆర్’మూవీ విడుదలకు ముందే రికార్డులు బద్ధలు కొడుతోంది. ఇప్పటికే విడులైన ట్రీజర్లు, పిక్స్, పోస్టర్లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియోను ప్రేక్షకుల్లోకి వదలారు. ఈ మేకింగ్ చూస్తుంటే మైండ్ పోతోంది. సీన్స్ అత్యంత రిచ్‌గా తెరకెక్కించారు. రాజమౌళి సినిమా అనగానే భారీ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ మూవీలో కూడా భారీ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇవి సినిమాలోనే హైలెట్‌గా చూపించారు. కథకు తగ్గట్టుగా సీన్స్ అబ్బురపరుస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెట్టింగులు నిర్మించినట్టు మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతోంది. నిర్మాతలు ఈ చిత్రం మేకింగ్ కోసం ఖర్చుకు వెనకడుగు వేయలేదనిపిస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఈ చిత్రంలోని సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలను హై క్వాలిటీతో చిత్రీకరిస్తున్నారు. భారీ సెట్టింగ్స్‌కు తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుతోంది. భారీ స్థాయిలో గ్రాఫిక్స్, విజువల్స్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో నిడివి రెండు నిమిషాలు ఉంది. ఈ వీడియో సాలిడ్‌గా ఉంది. చిత్రీకరణలో చాలా ఫ్రేమ్స్ చూపించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై తెరకెక్కించిన సీన్స్ హాలీవుడ్ లెవల్‌లో కనిపిస్తున్నాయి. షూటింగ్ స్పాట్‌‌లో రాజమౌళి డైరెక్టింగ్, ఆయన భార్య రమా రాజమౌళి కాస్టింగ్ సింప్లిసిటీగా ఉన్నాయి. ఇక సినిమా యూనిట్‌తో సందడి చేస్తూ షూటింగ్‌ తెరకెక్కిస్తున్నారు. హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యర్థులతో చేస్తున్న పోరాట సన్నివేశాలు పీక్ స్టేజ్‌కు వెళ్లిపోతున్నాయి. మన్యంలో యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

 

ఇక రామ్ చరణ్ ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజుగా కనిపిస్తున్నారు. రామ్ చరణ్ బాణంతో బ్రిటీష్ వారిపై ఫైట్ చేస్తున్న సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అటు ఎన్టీఆర్ ఈ మూవీలో కుమ్రం భీమ్‌గా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్‌పై తెరకెక్కిస్తున్న సాయుధ పోరాట సన్నివేశాలు, గాల్లో ఫైట్లు వంటివి కట్టిపడేస్తున్నాయి. భారీ సెట్టింగ్ లు తారక్,చరణ్ ల పాత్రల నీరు, నిప్పు ప్రతీకలతో ఒక లెక్కలో విజువల్స్‌తో డిజైన్ చేశారు. అలాగే ఈ మేకింగ్ పై డిజైన్ చేసిన ర్యాప్ సాంగ్ దానికి తగ్గట్టుగా కీరవాణి అందించిన బీట్స్ అదుర్స్ మంటున్నాయి. సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ యాక్టింగ్ కూడా ఈ మేకింగ్ చూస్తే వీర లెవల్లో ఉన్నట్టు అనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version