ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డ్…. నైజాం ఏరియాలో గత రికార్డులు బద్ధలు

-

ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. గతంలో ఉన్న రికార్డులను చెరిపేస్తోంది. కలెక్షన్ల దుమ్ముదులుపుతోంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు ముందు నుంచే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. తాాజాగా రూ. 1000  కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగుతీస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడం, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవ్ గన్ వంటి భారీ తారాగణంతో వస్తుండటంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్లుగానే మార్చి 25న విడుదలైన ఈ సినిమా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. 

తాజాగా మరో రికార్డ్ ట్రిపుల్ ఆర్ సొంతం అయింది. నైజాం ఏరియాలో గతంలో ఉన్న రికార్డును చెరిపేసింది. ఒక్క నైజాం ఏరియాలోనే రూ. 100 కోట్ల షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలా కలెక్షన్లు వసూలు చేసిన ఎకైక తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్ కావడం విశేషం. విడుదలైన 12వ రోజు కూడా నైజాంలో రూ. 2.12 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా 12 రోజుల్లో రూ. 101.29 కోట్ల షేర్ పొందింది. తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 243.5 కోట్ల షేర్ వసూలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version