ట్రెండ్ ఇన్: తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి..రికార్డుల వేట కొనసాగిస్తున్న RRR

-

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ గ్రాండియర్ RRR మార్చి 25న విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది. సినిమా విడుదలై దాదాపు 45 రోజులు అవుతున్నప్పటికీ సినిమా చూసేందుకు జనం థియేటర్ల బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి సాంగ్స్ ఫుల్ వీడియోస్, బ్యాక్ గ్రౌండ్ ఆడియో విడుదల చేస్తున్నారు మేకర్స్.

తాజాగా ‘కొమురం భీముడో’ సాంగ్ ఫుల్ వీడియో విడుదల చేశారు. ఇందులో తారక్, రామ్ చరణ్ ల పర్ఫార్మెన్స్ చూసి జనం ఫిదా అవుతున్నారు. తారక్ ఎక్స్ ప్రెషన్స్ తోనే కంట తడి పెట్టించడంతో పాటు రొమాలు నిక్కబొడిచేలా చేశాడని అంటున్నారు. రామ్ చరణ్ సైతం సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సాంగ్ ఎలివేట్ అయ్యేలా చేశాడని ప్రశంసిస్తున్నారు సినీ అభిమానులు.

ఈ క్రమంలోనే ఈ సినిమాను మరింత ప్రమోట్ చేసేందుకు సినీ అభిమానులు #RRRMovie హ్యాష్ ట్యాగ్ ఆర్ఆర్ఆర్ మూవీ పేరిట వరుస ట్విట్స్ చేస్తున్నారు. అలా నెటిజన్లు, సినీ అభిమానుల వరుస ట్వీట్లతో సదరు హ్యాష్ ట్యాగ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ పిక్చర్ కు స్టోరి విజయేంద్రప్రసాద్ అందించగా, మ్యూజిక్ ఎం.ఎం.కీరవాణి అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version