ట్రెండ్ ఇన్: OTTలోనూ దుమ్మురేపుతున్న RRR..ఆనందోత్సాహంలో సినీ అభిమానులు

-

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ తారక్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ. ఇది కాగా, ఈ ఏడాది మార్చి 25న విడుదలై రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నెల 20 నుంచి జీ5 ఓటీటీతో పాటు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమవుతోంది.

నెట్ ఫ్లిక్స్ లో హిందీ వర్షన్ స్ట్రీమవుతుండగా, జీ5లో అన్ని భాషల్లో స్ట్రీమవుతోంది. కాగా, ఓటీటీలోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటికే థియేటర్స్ లో రెండు లేదా మూడు సార్లు సినిమా చూసినప్పటికీ ఓటీటీల్లో చూసి జనాలు ఫిదా అవుతున్నారు.మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా సినిమాకు సంబంధించిన పోస్టర్స్ షేర్ చేసి హల్ చల్ చేస్తున్నారు సినీ అభిమానులు.

హ్యాష్ ట్యాగ్ ఆర్ఆర్ఆర్ మూవీ తో #RRRMovie..వరుస ట్వీట్స్ చేస్తున్నారు. అలా సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రామ్ చరణ్, తారక్ ల పర్ఫార్మెన్స్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఈ దృశ్య కావ్యానికి విజయేంద్రప్రసాద్ స్టోరి అందించగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించారు. సముద్రఖని, అజయ్ దేవగణ్, శ్రియా సరణ్ కీలక పాత్రలు పోషించారు. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఆలియా భట్ నటించగా, తారక్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలివియా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news