ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జమ్ము కాశ్మీర్ లో పర్యటించారు. సాంబా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోడీ. మొదటగా ఢిల్లీ, అమృత్సర్- సర్ కాత్రా ఎక్స్ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు. జమ్మూ కాశ్మీర్ కు అభివృద్ధి అనే సందేశాన్ని తాను మోసుకొచ్చారు అని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటన చేశారు.
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని 20వేల కోట్ల అభివృద్ధి పనులను తాను ఇవ్వాళ ప్రారంభించాలని గుర్తుచేశారు ప్రధాని నరేంద్ర మోడీ. పల్లి గ్రామం దేశంలోనే తొలి కర్బన ఉద్గారాలులేని పంచాయతీగా నిలిచిందని మోడీ అన్నారు. ఈ సంవత్సరం పంచాయతీ దినోత్సవాన్ని జమ్మూలో జరుపుకుంటామని వివరించారు ప్రజాస్వామ్యం మూల స్థాయిల వరకు వెళ్లిందని వివరించారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల జమ్మూ ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని దానిని త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.