రూ.2,155 కోట్ల RTC అప్పులను తీర్చాం : ద్వారకా తిరుమల రావు

-

గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన రూ.122 కోట్ల ఆదాయాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికే అధిగమించినట్లు RTC MD ద్వారకా
తిరుమలరావు తెలిపారు. ఉద్యోగులకు రూ.966 కోట్ల PF బకాయిల్ని, రూ.269 కోట్ల CCS బకాయిల్ని, రూ.2,155 కోట్ల అప్పులను తీర్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు కారకులైన సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలిపారు. నిరసనలు, ధర్నాలు, సమ్మెలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉంటే.. శ్రీశైలం వెళ్లే యాత్రికులు బస్సు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకుంటే స్పర్శదర్శన టికెట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

శ్రీశైలం వెళ్లే యాత్రికులు బస్సు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకుంటే స్పర్శదర్శన టికెట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంతో పాటు, పొరుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలకూ ప్రత్యేక సర్వీసులు నడిపేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. బస్సుల్లో తిరుపతి వెళ్లే భక్తులకు శ్రీవారి శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులో ఉంచినట్లే శ్రీశైలం విషయంలోనూ ఈ విధానాన్ని తెస్తున్నాం. పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం ఇకపై వివిధ ప్యాకేజీలు తీసుకొస్తాం. భక్తులకు రాత్రి వేళల్లో వసతి కల్పించడంతో పాటు టూరిస్ట్‌ గైడ్‌లనూ అందుబాటులో ఉంచుతామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news