రష్యా అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ… నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చించాలని పుతిన్ కు సూచన

-

ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు. దాదాపు 50 నిమిషాల పాటు ఇరు దేశాల అధినేతలు చర్చించారు. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య చర్చల స్థితిగతులను పుతిన్.. ప్రధాని  మోదీకి వివరించారు. కాగా.. ఈ ఉక్రెయిన్, రష్యాల బృందాల చర్చలతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో పాటు నేరుగా చర్చించాలని ప్రధాని మోదీ పుతిన్ కు సూచించారు. సుమీ ప్రాంతంలో కాల్పుల విరమణ ప్రకటన, మానవతా కారిడార్ ఏర్పాటు చేయడంపై పుతిన్ ను మోదీ ప్రశంసించారు. ఇదిలా ఉంటే సుమీలో చిక్కకున్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడం ప్రాధాన్యతను ప్రధాని మోదీ పుతిన్ కు వివరించారు. భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంపై పుతిన్, మోదీకి హామీ ఇచ్చారని భారతప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు… ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో ప్రధాని మోదీ దాదాపు 35 నిమిషాలు మాట్లాడారు. ఇరు దేశాలు కూడా చర్చలు ప్రారంభించడాన్ని మెచ్చుకున్నారు. భారతీయుల తరలింపుకు ఉక్రెయిన్ చూపిన చొరవకు థాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news