నేను బతకాలనుకుంటున్నా.. నాకు దేవుడు రెండో అవకాశం ఇచ్చాడు : ఉక్రెయిన్ లో కాల్పుల్లో గాయపడ్డ హర్జోత్ సింగ్

-

ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధంలో దాాదాపుగా అందరు భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఆపరేషన్ గంగా ద్వారా భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ యుద్ధం కారణంగా ఓ భారతీయ వైద్య విద్యార్థి మరణించగా.. మరో విద్యార్థి కాల్పుల్లో గాయపడ్డాడు. ప్రస్తుతం హర్జోత్ సింగ్ అనే విద్యార్థి చికిత్స పొందుతున్నాడు.

నేను బతకాలని అనుకుంటున్నా… నాకు దేవుడు రెండో అవకాశం ఇచ్చాడు. నేను ఇండియాకు తిరిగి రావాలని, మా కుటుంబ సభ్యులతో గడపాలని అనుకుంటున్నా అని హర్జోత్ సింగ్ అన్నారు. నేను చనిపోయిన తర్వాత చార్టెడ్ ఫ్లైట్ పంపినా పర్వాలేదంటూ తన ఆవేదనను తెలిపాడు. నన్ను ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని, వీల్ చైర్ వంటి సౌకర్యాలు కల్పించాలని, డాక్యుమెంటేషన్‌లో నాకు సహాయం చేయాలని రాయబార కార్యాలయాన్ని అభ్యర్థిస్తున్నానని హర్జోత్ సింగ్ అన్నారు. భారత రాయబార కార్యాలయం నుండి ఎటువంటి మద్దతు లేదని… నేను వారితో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను, ప్రతిరోజూ మేము ఏదో ఒకటి చేస్తామని చెబుతారు, కానీ ఇంకా సహాయం చేయలేదు హర్జోత్ సింగ్ అన్నారు. ప్రస్తుతం కీవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గత నెల 27న కీవ్ నుంచి బయటపడేందుకు ఓ ట్యాక్సిని బుక్ చేసుకుని బయలుదేరామని.. మూడు చెక్ పోస్టులు దాటిన తర్వాత పరిస్థితి బాగా లేకపోవడంతో వెనుదిగిరి వచ్చామని ఆయన అన్నారు. ఆసమయంలో మాపై బిల్డింగ్ పై నుంచి కారు ముందు నుంచి ఏకే 47 లతో కాల్పులు జరిపారని .. దీంతో బుల్లెట్ గాయాలు అయ్యాయని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news